![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -22 లో.. సిరి ఫోన్ చేస్తుంటే ధన కట్ చేస్తూ ఉంటాడు. ఆలా చెయ్యడం సిరి చూసి ఏంటి ధనా.. నా ఫోన్ కట్ చేస్తున్నాడని ఎదరుపడుతుంది. అయిన పట్టించుకోకుండా వెళ్తుంటే ఎందుకు నన్ను అవైడ్ చేస్తున్నావని సిరి ఎమోషనల్ అవుతుంది. అయిన ధన అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు సిరి ఎవరినో ప్రేమిస్తుందని శ్రీవల్లి చెప్పిన విషయం సీతాకాంత్ గుర్తుకు చేసుకుంటాడు.
అ తర్వాత సీతాకాంత్ ఏదో ఆలోచిస్తూ.. డల్ గా ఉండడం రామలక్ష్మి గమనిస్తుంది. ఆ తర్వాత శ్రీలత ఏదో పని మీద బయటకు వెళ్తుంది. అక్కడ తనని మాణిక్యం చూసి షాక్ అవుతాడు. తన కార్ వెంబడే పరిగెడుతు ఉంటాడు. ఆయాసం వచ్చి ఆగిపోయి కార్ నెంబర్ చూస్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ ని తీసుకొని రామలక్ష్మి ఇంటికి వస్తుంది. ఇక నేను వెళ్తానని అని రామలక్ష్మి అనగానే.. ఎలా వెళ్తావ్ అమ్మాయి. నీ ఒక్కదాన్ని ఎలా పంపించాలి.. డ్రైవర్ తనని డ్రాప్ చేసి రా అని పంపిస్తాడు. అదంతా చూస్తున్న శ్రీవల్లి..
ఒక డ్రైవర్ కి ఇంకో డ్రైవర్ ని ఇచ్చి పంపించడం.. ఏదో జరుగుతుంది ఒక కన్ను వేసి ఉంచాలని తన పనిమనిషితో అంటుంది. ఆ తర్వాత ఇంకా రామలక్ష్మి రాలేదా అంటూ మాణిక్యం తన భార్యని విసిగిస్తుంటాడు. అక్క జాబ్ లో జాయిన్ అయిందని పింకీ అనగానే.. జాబ్ లో జాయిన్ అయితే డబ్బులు నెలకొకసారి వస్తాయి. నాకు రోజు డబ్బులు ఎలా అని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి వస్తుంది. తన దగ్గర డబ్బులు తీసుకొని మాణిక్యం వెళ్ళిపోతాడు. అ తర్వాత ఎవరినో ఫోన్ అడిగి తన ఫ్రెండ్ కి కాల్ చేసి కార్ నెంబర్ చెప్పి అడ్రస్ కనుక్కోమని అనగానే అతను చెప్తాడు. ఎవరినో మాణిక్యం కలిసి మాట్లాడడం సీతాకాంత్ వాళ్ళ తాతయ్య చూసి సీతాకాంత్ కి ఫోన్ చేసి చెప్పగానే.. అతను బయలుదేరి వస్తాడు. కానీ సీతాకాంత్ వచ్చేలోపే మాణిక్యం అడ్రస్ కనుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తన ఫోటో చూసి నన్ను ఇంకా మర్చిపోలేదా అనుకొని.. నాకు కావాలసింది ఇక్కడే ఉందంటు సిరి రూమ్ లోకి వెళ్లగానే శ్రీలత వచ్చి తనని చూసి షాక్ అవుతుంది. వెంటనే అక్కడ నుండి మాణిక్యం వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీలత సీతాకాంత్ కి ఫోన్ చేసి మాణిక్యం వచ్చాడని చెప్తుంది.
సీతాకాంత్ హడావిడిగా ఇంటికి వచ్చి బయపడుతున్న వాళ్ళ అమ్మని మాణిక్యం గురించి అడుగుతాడు. వాడు వచ్చాడని చెప్పగానే వెంటనే సీతాకాంత్ సీసీ టీవీలో చూస్తాడు. అందులో మాణిక్యం ఇంట్లోకి వచ్చినట్లు ఉంటుంది.. మళ్ళీ వచ్చావా అంటూ సీతాకాంత్ తన గతాన్ని గుర్తుకుచేసుకుంటాడు. గతంలో సీతాకాంత్ బాల్యంలో వాళ్ళ గుమాస్తాగా మాణిక్యం ఉండేవాడు. అతన్ని సీతాకాంత్ ప్రేమగా మామ అని పిలిచేవాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |